నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు ప్రశస్తమైన వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 49:25 వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనములో, " యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు బలాఢ్యులు చెరపట్టినవారు సహితము విడిపింపబడుదురు భీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసెదను నీ పిల్లలను నేనే రక్షించెదను'' అని చెప్పబడిన ప్రకారము మన సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు తెలియజేసిన మాట ఎంత ఆదరణకరమైనది కదా! మీరు పోరాడటానికి ఎంతో కష్టంగా అనిపించే యుద్ధాలను ఎదుర్కొంటుండవచ్చును. ఆలాగుననే, మిమ్మల్ని వ్యతిరేకించే వ్యక్తులు, మీకు వ్యతిరేకంగా తలెత్తుచున్న పరిస్థితులు లేదా మీకు తీవ్రంగా భయక్రాంతులను చేయుచున్న భయాలు మీరు ఎదుర్కొంటుండవచ్చును. కానీ, ప్రభువు ఇలాగున అంటున్నాడు, 'మీరు ఒంటరివారు కాదు. నేను మీ కొరకు పోరాడుచున్నాను. తన పిల్లలు దాడి చేయబడినప్పుడు దేవుడు మౌనముగా ఉండడు. ఆయన మీ పక్షమున ఒక శక్తివంతమైన పరాక్రమశాలురుగా మీకు విరోధముగా వచ్చు ప్రతి పోరాటము మీదికి లేస్తాడు. మిమ్మును ఎదిరించు వారిని ఆయన ఎదిరిస్తాడు. ఈ లోకము దానిని చూడక పోవచ్చును, కానీ అదృశ్యమైన రాజ్యంలో, దేవుడు మిమ్మును మరియు మీ కుటుంబాన్ని రక్షించడానికి ప్రతి క్షణం పనిచేయుచున్నాడు. ఇశ్రాయేలు కొరకు పోరాడిన, ఎర్ర సముద్రాన్ని రెండుపాయలుగా చేసిన మరియు ఫరో సైన్యాన్ని మునిగిపోవునట్లు చేసిన దేవుడు ఆయనే. అదే శక్తి నేడు మీ పక్షమున కూడా పోరాడుతుంది. కనుకనే, భయపడకండి.
నా ప్రియులారా, నేడు మీరు చుట్టుముట్టబడినట్లు లేదా నిస్సహాయంగా భావించినప్పుడు, యుద్ధం మీది కాదని గుర్తుంచుకోండి - అది యెహోవాది. అందుకే బైబిల్ నుండి యిర్మీయా 1:19వ వచనములో ఇలాగున చెబుతుంది, " వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యున్నందున వారు నీపైని విజయము పొందజాలరు; ఇదే యెహోవా వాక్కు'' ప్రకారము అవును, దుష్టులు లేచి మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నవచ్చు, కానీ వారు విఫలమవుతారు. ఎందుకు? ఎందుకంటే మీరు దేవుని బిడ్డలు గనుకనే. దేవుని చేతితో గీసిన గీతను దాటకుండా శత్రువు మిమ్మును ముట్టలేడు. అందుకే బైబిల్ నుండి యెషయా 54:15 ఇలాగున చెబుతుంది, " జనులు గుంపుకూడినను వారు నా వలన కూడరు నీకు విరోధముగా గుంపుకూడువారు నీ పక్షపు వారగుదురు'' ప్రకారము అబీమెలెకు రాజు ఇస్సాకు యెదుట సాగిలపడి వంగి, " వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి గనుక మనకు, అనగా మాకును నీకును మధ్యనొక ప్రమాణముండవలెను' అని చెప్పబడినట్లుగానే, నేడు మీ శత్రువులు, 'దేవుడు మీతో ఉన్నాడనియు' ఒప్పుకుంటారు. ఇస్సాకును రక్షించిన దేవుడు, అతని ఆశీర్వాదాలను నూరంతలుగా అభివృద్ధిపరచిన దేవుడు, నేడు మిమ్మల్ని కూడా రక్షించి, అభివృద్ధిపరుస్తాడు. ఆయన మీ పిల్లలను కూడా సమస్త దుష్టత్వము మరియు కీడు నుండి కాపాడి సంరక్షిస్తాడు. ప్రభువు హస్తం అగ్ని ప్రాకారంవలె మీ కుటుంబాన్ని చుట్టుముడుతుంది.
కాబట్టి, ప్రియ దేవుని బిడ్డలారా, భయపడకండి. దృఢంగా నిలిచి ప్రభువు రక్షణను చూడండి. కీర్తనాకారుడు బైబిల్ నుండి కీర్తనలు 124:1-3వ వచనములో ఇలాగు అంటున్నాడు, " మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడైయుండని యెడల వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడైయుండని యెడల వారు మనలను ప్రాణముతోనే మింగి వేసియుందురు'' అని చెప్పబడిన ప్రకారము నిజంగా, ప్రభువు మీ పక్షాన ఉన్నాడు! ప్రజలు మిమ్మును హేళన చేసినప్పుడు, దేవుడు మిమ్మును ఉన్నత స్థాయికి తీసుకువెళతాడు. శత్రువులు మీ పతనానికి ప్రణాళిక వేసినప్పుడు, దేవుడు దానిని మీ ప్రమోషన్‌గా మారుస్తాడు. కనుకనే బైబిల్ నుండి కీర్తనలు 118:11వ వచనములో చూచినట్లయితే, " నలుదిశలను వారు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను'' అని చెప్పబడినట్లుగానే, నా ప్రియులారా, ఈ రోజు మీ విజయాన్ని ప్రకటించే దినము ఇదియే! మిమ్మల్ని ప్రేమించుచున్న క్రీస్తు ద్వారా మీరు కేవలం ఒక విజేత మాత్రమే. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 8:37వ వచనములో చూచినట్లయితే, "అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము'' ప్రకారము మీరు కూడా అట్టి విజయమును పొందుకోవాలంటే, ఇప్పుడే ఆయనను స్తుతించండి, ప్రేమించండి మరియు ఆరాధించండి. యేసు, యోహాను 5:17వ వచనములో సెలవిచ్చియున్నాడు, "అయితే యేసు నా తండ్రి యిది వరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను'' అని చెప్పబడిన ప్రకారముగానే గుర్తుంచుకోండి, దేవుడు యిది వరకు పనిచేయుచున్నాడు, - కనిపించని యుద్ధాలతో పోరాడుతూ, మీ ప్రియులైన వారిని కాపాడుతూ, మిమ్మల్ని బలంగా నిలబెడతాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మీ పక్షమున పోరాడి యుద్ధము చేసి, మిమ్మును విజయవంతులనుగా చేసి, మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా పక్షమున ఉండి మా యొక్క ప్రతి యుద్ధంలో పోరాడినందుకు వందనాలు. ప్రభువా, నీవు మా రక్షకుడవు, మా కేడెము మరియు మా బలమైన కోటగా ఉన్నందుకై నీకు కృతజ్ఞతలు. ప్రభువా, నీవు మాకు వ్యతిరేకంగా పోరాడే వారితో పోరాడుము మరియు మా పిల్లలను సమస్త కీడు మరియు దుష్టత్వము నుండి కాపాడి సంరక్షించుము. దేవా, మా యొక్క పోరాటాల మధ్య మా హృదయాన్ని విశ్వాసముతోను మరియు సమాధానముతోను నింపుము. ప్రభువా, మాకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధమూ వర్థిల్లకుండా చేయుము. దేవా, మా యొక్క ప్రతి దాడిని మీ శక్తికి సాక్ష్యంగా మార్చుము. ప్రభువా, నీ యొక్క సమాధానమును మరియు నీ యొక్క బలమైన చేతిలో నమ్మకం ఉండడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా జీవితం నీ యొక్క పరిశుద్ధ నామానికి మహిమను కలిగించునట్లుగా కృపను చూపుమని యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


