నా ప్రశస్తమైన స్నేహితులారా! ఈ  మే నెలలో ప్రభువు మన జీవితములలో సమస్తమును పునర్నిర్మిస్తానని వాగ్దానమిచ్చుచున్నాడు. కీర్తన 102:16 లో పరిశుద్ధ గ్రంథము ఈ విధముగా చెప్పుచున్నది.  

''ఏలయనగా యెహోవా సీయోనును కట్టియున్నాడు; ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను.''

మన జీవితములో ఏదైతే నాశనమైనదో లేదా చెదిరిపోయిందో, మన జీవితమును పునర్నిర్మించుటకు తన బలమును అనుగ్రహిస్తానని మరియు తన మహిమతో మనలను నింపుతానని ప్రభువు వాగ్దానమిచ్చుచున్నాడు. మనము పొంగిపొరలే సంతోషమును కలిగియుండెదము మరియు గొప్ప జీవితమును మరలా పొందుకొనెదము (యెషయా 61:4, యెషయా 40:31 & యెషయా 58:12).  

మన జీవితములలో ప్రభువు పునర్నిర్మించబోవు కార్యములు ఏమిటి?

1. మన భాగ్యము లేదా తలరాత పునర్నిర్మించబడును: మనకు బండగా లేదా రాతిగా ఉంటూ మన జీవితములో సమస్తమును ప్రత్యేకించి మన సంబంధ బాంధవ్యములను, ఆర్ధిక పరిస్థితులను, ఆరోగ్యమును మరియు మన పేరు ప్రఖ్యాతులను పునర్నిర్మించి స్థిరపరుస్తానని ప్రభువు వాగ్దానమిచ్చున్నాడు. మనము ఏమి విత్తినా అది ఫలిస్తుంది, మన పని మరియు మన జీవితము వర్ధిల్లుతుంది. దేవుని ఆశీర్వాదము మరియు ఆయన సమకూర్పు మన జీవితములలో వెల్లడిపరచబడతాయి మరియు మనము ఆ నూతన బండ లేదా రాతితో పైకి లేవనెత్తబడెదము మరియు మన జీవితములు పునర్నిర్మింపబడతాయి (ఆమోసు 9:14, యెషయా 9:10, 1 కొరింథీయులకు 10:4 & అపొ.కా. 15:16).    

2. పరిశుద్ధాత్మ ద్వారా మీ కుటుంబము పునర్నిర్మింపబడుతుంది: మన కుటుంబములో ప్రతి ఒక్కరిపై ఆయన తన ఆత్మను కుమ్మరిస్తాడు, యేసు క్రీస్తు యొక్క సాక్ష్యమును పంచుకొనుచు మన కుమారులు మరియు కుమార్తెలు ప్రవచిస్తారు. ప్రభువు మనలను తన నివాస స్థలముగా చేస్తాడు మరియు మన కుటుంబము ఘనపరచబడుతుంది (యోవేలు 2:25-27 & ప్రకటన 19:10).

3. మన పేరు పునర్నిర్మింపబడును: మనము సిగ్గునొందిన ప్రదేశములోనే ఆయన మనలను విజేతలుగా ఉంచుతాడు మరియు మనకు క్రొత్త పేరు అనుగ్రహిస్తాడు, క్రొత్త స్థాయి, క్రొత్త హోదా మరియు నూతన విజయములు మనము పొందుకొనెదము మరియు మనము గొప్ప ఘనతతో సహా దేవుని నూతన మహిమను పొందుకొనెదము (ప్రకటన 2:17, యెషయా 62:2, యెషయా 65:15 & జెఫన్యా 3:19).  

4. ప్రభువు మన జీవితమును తన మహిమతో పునర్నిర్మిస్తాడు: ప్రభువు తన మహిమతో వచ్చినపుడు ఆయన అన్ని దేశములను, ఆకాశములను, సముద్రములను, ఎండిన భూమిని కంపింపజేస్తాడు మరియు తన ప్రజలను తన మహిమతో నింపుతాడు. ఆ ప్రకారముగా ఎప్పుడైతే మన జీవితములో కంపించబడుట లేదా వణకుట జరుగుతుందో అప్పుడు మన జీవితములో దేవుని మహిమ అత్యధిక పరిమాణములో ప్రత్యక్షపరచబడుతుంది. ఆయన అనుగ్రహించే తన మహిమ మునుపటి మహిమ కంటే గొప్పదిగా ఉంటుంది (హగ్గయి 2:6).

‘నా ప్రియ పరలోకపు తండ్రీ, మీ బిడ్డ ప్రయాణించుచున్న అవమానమంతటిలో, నొప్పియంతటిలో, నష్టములన్నింటిలో, సిగ్గుయంతటిలో, విరిగినలిగినస్థితి అంతటిలో వారి జీవితములలోనికి మీ మహిమను మరల పంపించండి. వారి జీవితములను, వారి ఆత్మలను, వారి వృత్తిని, వారి కుటుంబమును, వారి పరిచర్యను పునర్నిర్మించండి. అన్నింటిలో గొప్ప మహిమ కలుగునుగాక! యేసు మాహాత్మ్యము కలిగిన నామములో నేను ప్రార్థించుచున్నాను. ఆమెన్’.

దేవుడు మిమ్మును తన నివాస స్థలముగా పునర్నిర్మించుచుండగా మహమకరమగు దినములు వచ్చుచున్నవి.

మిక్కిలి ప్రేమ మరియు ప్రార్థనలతో,
మీ ప్రియ సహోదరుడు,
డా. పాల్ దినకరన్

సిఓఓ గారి కార్యాలయము నుండి  
మీ కారణముగా - ఏప్రియల్ నెలలో పరిచర్యలో కనుపరచబడిన ప్రభావము


మీయొక్క మనఃపూర్వక ప్రార్థనలు మరియు ఉదారమైన విరాళము మూలముగా గత నెలలో 2 కోట్ల 67 లక్షల ప్రార్థన విన్నపముల కొరకు మేము పరిచర్య సేవలను మేము అందించాము, జీవితములు మరియు కుటుంబములను నిర్మించుచున్నాము కనుక మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము.

  • ప్రార్థన గోపురములలో 1.5 లక్షల మంది సందర్శకులకు వ్యక్తిగత ప్రార్థనలు చేయబడినవి.
  • 24x7 ప్రార్థన హెల్ప్ లైన్ల ద్వారా 3.9 లక్షల ప్రార్థన కాల్స్ నిమిత్తము ప్రార్థనలు చేయబడినవి.
  • డిజిటల్ వేదికల ద్వారా 2.2 మిలియన్ల మంది ప్రజలు దేవుని ప్రేమను అనుభవించారు.
  • 60,000 ఉత్తరములు మరియు ఈమెయిళ్లను పొందుకొన్నాము, వాటి కొరకు ప్రార్థించి జవాబులు పంపబడినవి.  
  • సామాజిక మాధ్యమము ద్వారా 2.8 కోట్ల మంది వీక్షకుల జీవితములను మేము తాకియున్నాము.
  • గత బ్యాచ్ లో ప్రార్థన మరియు ప్రవచనాత్మక సాధికారత శిక్షణ పొందిన 80 మంది విద్యార్థులు ప్రజలకు సేవలు అందించుటలో యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో చురుకుగా భాగము నొందుచున్నారు.  
  • ప్రార్థన గోపురములు అన్నింటిలో 210 ఔట్రీచ్ కూటములు నిర్వహింపబడి 20,600 మంది ప్రజలను ప్రభావితం చేసినవి.  

పైన తెలిపిన ప్రతి సంఖ్య తాకబడినట్టి ఒక జీవితము అని మనము గ్రహించాలి - ఈ అద్భుతములో మీరు కూడా ఒక భాగమైయున్నారు.

గత నెలలో అన్ని కూటములలో పరిశుద్ధాత్ముడు బలముగా కదలాడాడు. ఇప్పటికి కూడా జీవముకలిగి పనిచేయుచు జీవితములను పునర్నిర్మించుచు కట్టుచున్నట్టి పునరుత్ధానుడైన క్రీస్తు యొక్క విజయమునుగూర్చి డా. పాల్ దినకరన్ గారు ధైర్యముగా ప్రకటించారు. డా. డి.జి.యస్. దినకరన్ ప్రార్థన గోపురములో నిర్వహింపబడిన శుభ శుక్రవారం ఆరాధనలో దినకరన్ కుటుంబ సభ్యులు పరిచర్య చేసారు. సిలువ శక్తి మరియు ఉద్దేశ్యమును ప్రతిబింబించుటకు వేలాది ప్రజలు కదలివచ్చారు మరియు ప్రతి వ్యక్తి కూడా జయము పొందుకొని యేసు క్రీస్తులో నూతన జీవితమును జీవించాలని వారు ప్రార్థించారు. ఏప్రియల్ నెల 18 వ తారీఖున అస్సామ్ లోని గౌహతి లో నిర్వహింపబడిన భాగస్థుల కూటములో భారత దేశములోని ఉత్తర తూర్పు ప్రాంతమునుండి వచ్చిన వేల సంఖ్యలో భాగస్థులకు డా. పాల్ దినకరన్ గారు మరియు సహోదరి. ఇవాంజెలిన్ పాల్ దినకరన్ గారు పరిచర్య చేసారు. పరిచర్యకు విశ్వసనీయముగా చేయూత అందించుచున్నట్టి ధీఫు, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్ మరియు గౌహతి వంటి ప్రాంతములనుండి వచ్చిన వందలాది ప్రార్థన వాలంటీర్లను  వారు వ్యక్తిగతముగా కలిసారు మరియు Northeast Leaders & Partners Meet లో పాల్గొన్న పాస్టర్లకు ప్రార్థించి వారిని ప్రోత్సహించారు.

ప్రపంచ దేశములలో (మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, భారత దేశము, చైనా మరియు ఆస్ట్రేలియా) ఏమి జరగబోవుచున్నది అను విషయములను గూర్చి, అంత్య క్రీస్తు లేవనెత్తబడుటను గూర్చి మరియు క్రీస్తు రెండవ రాకడను గూర్చి 2014  సంవత్సరము ఫిబ్రవరి నెలలో తాను తెలిపిన మొదటి ప్రవచనములను డా. పాల్ దినకరన్ గారు జ్ఞాపకము చేసికొన్నారు. వీటిని ఇప్పుడే వీక్షించుటకు https://bit.ly/IRANWARPROPHECYTL లింక్ ను క్లిక్ చేయగలరు.     

 

మే నెలలో పరిచర్య

హైదరాబాదు ప్రార్థన గోపురము :దేవుని చిత్తమైతే జూన్ 2026 చివరిలో నూతన హైదరాబాదు ప్రార్థన గోపురమునందు కార్యకలాపములు నిర్వహించుటకు సిద్ధముగా ఉన్నది. ఛాపెల్ మరియు ప్రార్థన ఆడిటోరియంల అవసరతల నిమిత్తము మీరు చేసిన సహాయము గొప్ప  చేయూతగా నిలిచింది. ఒక ప్రార్థన గది నిర్మాణము కొరకు రూ 3 లక్షలు స్పాన్సర్ చేయుటకు లేదా ప్రార్థన గది లేదా ఛాపెల్ కొరకు కో-స్పాన్సర్ చేయుటకు మీరు ముందుకు రావచ్చును. ప్రార్థన గదులు లేదా ఛాపెల్ కొరకు స్పాన్సర్ చేసినవారిని లేదా కో.స్పాన్సర్ చేసినవారిని తరతరములు ప్రార్థన పూర్వకముగా జ్ఞాపకము చేసికొను నిమిత్తము వారి పేర్లను గదులలో మరియు ఛాపెల్ లో ఉంచబడును. ప్రార్థన ఆడిటోరియంల కొరకు రూ. 10000/- కు పైగా విరాళము ఇచ్చినవారిని కృతజ్ఞతతో జ్ఞాపకము చేసికొనుటకు వారి పేర్లు గదిలో ఉంచబడును. పైన తెలిపిన విధముగా విరాళము అందించుటకు  QR code ను scan చేయగలరు లేదా  https://bit.ly/HYDPTBF అను లింక్ ను క్లిక్ చేయగలరు.

హైదరాబాదు ప్రార్థన గోపురము కట్టడ నిధి కొరకు విరాళము ఇచ్చుటకు scan చేయండి.  


 నిరీక్షణను తీసుకొనివచ్చుటకు చేతులు కలపండి
ఒక అత్యంత అవసరత అయినట్టి ప్రార్థన ఆశించుచు వచ్చే ఏ ఒక్కరు కూడా పొందుకొనకుండ వెనుదిరగకూడదని ఈ అభివృద్ధి కార్యకలాపములన్నియు రూపకల్పన జరుగుచున్నవి.
దేవుని నిర్మాణములో భాగముకండి.

హైదరాబాదు ప్రార్థన గోపురము భవనము అభివృద్ధిలో దిగువ తెలిపిన విధముగా మీరు కూడా భాగము కావచ్చును.  

ప్రార్థన గది లేదా ఛాపెల్ కొరకు

  •  ప్రార్థన గది లేదా చాపెల్ నిమిత్తము నేను రూ. 3 లక్షలు స్పాన్సర్ చేస్తాను
  •  నేను రూ. 2  లక్షలు లేదా అంతకు పైగా కో-స్పాన్సర్ చేస్తాను
  •  నేను రూ. 1  లక్ష లేదా అంతకు పైగా కో-స్పాన్సర్ చేస్తాను
  •  నేను రూ. 50,000  కో-స్పాన్సర్ చేస్తాను           

 ప్రార్థన ఆడిటోరియంల కొరకు

  •  నేను రూ. 25,000  కో-స్పాన్సర్ చేస్తాను
  •  నేను రూ. 10,000  కో-స్పాన్సర్ చేస్తాను
  •  నేను రూ. 5,000  కో-స్పాన్సర్ చేస్తాను

 లేదా పరిశుద్ధాత్ముడు మీ హృదయమును ప్రేరేపించిన ప్రకారం స్పాన్సర్ చేయండి.

డైనమిక్ కిడ్స్ క్యాంప్: ఈ సంవత్సరము ఈ క్యాంపులో 20,000 మంది పిల్లలు పాల్గొని ఇందులో నిర్వహింపబడు వివిధ కార్యక్రమముల ద్వారా వారు దీవింపబడెదరని మేము ఎదురుచూస్తున్నాము. ప్రభువు మిమ్మును ప్రేరేపించిన ప్రకారం ఎంత మంది పిల్లల కొరకైనా మీరు స్పాన్సర్ చేయవచ్చును. స్పాన్సర్ చేయుటకు ఇప్పుడే క్లిక్ చేయండి

ప్రార్థన గోపురములలో ప్రత్యేక కూటములు:

  • మే 16, 2026 - జబల్పూర్ ప్రార్థన గోపురము ఛింద్వారాలో నిర్వహించు ఔట్రీచ్ కూటము
  • మే 19, 2026 - డెహ్రాడూన్ ప్రార్థన గోపురము పౌరి లో నిర్వహించు ఔట్రీచ్ కూటము
  • మే 21, 2026 - డా. డి.జి.యస్. దినకరన్ ప్రార్థన గోపురము పోరూర్ లో నిర్వహించు ఔట్రీచ్ కూటము


సహో. శామ్యూల్ దినకరన్ గారి ప్రత్యేక కూటములు  

  • మే 16, సాయంత్రం 6 గం.లకు - డేనిష్ మిషన్ హయ్యర్ సెకండరీ స్కూల్, తీరువణ్ణామలై.  
  • మే 31, రాత్రి 9 గం.లకు - ఆదివారము ఆశీర్వాద కూటము, జేసీ హౌస్, చెన్నై - 600001    

ఈ చుట్టుపట్ల ప్రదేశములలో మీరు ఉన్నచో మీకు దగ్గరలో ఉన్న ప్రార్థన గోపురముతో అనుసంధానమై అందులో భాగము పొందండి.

 

కారుణ్య విశ్వవిద్యాలయము
మానవాళికి సేవలు అందించు నిమిత్తము సైన్స్, ఇంజినీరింగ్ మరియు టెక్నాలజీ లో భవిష్యత్తు నాయకులను సృష్టించుచున్నది

  • Advance research in robotics కొరకు Rs.32.88 లక్షలు research funding ను IIT IHub నుండి Karunya faculty పొందుకొన్నది.  
  • MSME Idea Scheme క్రిందన Innovative and efficient food processing solutions ను అభివృద్ధి చేయుటకు Rs 15.00 లక్షల విలువైన ప్రాజెక్టును Karunya incubatee స్వంతం చేసికొన్నది.
  • Karunya University Job Fair 2026 నిర్వహించుట ద్వారా 20+ leading company HRs and over 1,000 job seekers ను కలుపుచు interviews, networking, and career opportunities కొరకు ఒక vibrant platform ను సృష్టించుచున్నది. విద్యార్థులు తమ నైపుణ్యతలను ప్రదర్శించి తమ భవిష్యత్తు కొరకు ఆత్మవిశ్వాసముతో అడుగులు వేసారు.
  • Autodesk చే నిర్వహించబడిన India Design Week Challenge లో కారుణ్య విద్యార్థులు తమ innovative design of a Modular Disaster-Relief Rescue Cart కు ప్రధమ బహుమతిని గెలుచుకొని రూ. 50,000 నగదు పురస్కారమును పొందుకొన్నారు.  
  • Advanced biomedical sensing and Next-generation healthcare monitoring systems లలో Karunya faculty మరియు students రెండు నూతన పేటెంట్లు కొరకు దరఖాస్తు చేసికొన్నారు.  
  • 2026-2027 విద్యా సంవత్సరము కొరకు ప్రతి UG and PG program కొరకు కారుణ్య విశ్వవిద్యాలయములో ప్రవేశములు పూర్తియగుచున్నవి. అనేక కోట్ల రూపాయల విలువైన స్కాలర్షిప్పులు ప్రకటింపబడినవి. మరింత సమాచారం నిమిత్తము http://admissions.karunya.edu ను దర్శించండి.  

సీషా
కరుణతో కూడిన సంరక్షణచే జీవితములలో నిరీక్షణను తీసికొనివచ్చుచు వాటిని పునర్నిర్మాణము చేయుచున్నది

  • మణిపూర్ లోని Kalapahar లో ఉన్న సీషా నేర్చుకొనే కేంద్రము (SEESHA’s Learning Centre) లో చేర్చబడిన తల్లిదండ్రులను కోల్పోయిన 55 మంది బిడ్డలు సీషా నూతన దుస్తులను పొందుకొన్నారు.  
  • Coimbatore లో Psychosocial Rehabilitation & Counselling Services ద్వారా 107 మంది లబ్దిదారులు counseling పొందుకొన్నారు. ప్రత్యేక అవసరతలు కలిగిన 15 మంది చిన్నారులు చెన్నై లోని Vanagaram Rehabilitation centre లో special education మరియు physiotherapy ను పొందుకొన్నారు.  
  • Cuddalore లో HIV/AIDS తో పీడింపబడుచున్న 120 మంది చిన్నారులు సీషా ద్వారా పోషకాహార సప్లిమెంట్లను పొందుకొన్నారు మరియు Cuddalore, Thanjavur, and Chennai లలో నిర్వహింపబడిన ఉచిత వైద్య శిబిరముల ద్వారా 100 మందికి పైగా ప్రజలు లబ్దినొందారు.
  • దేవుని కృప, మీ ప్రార్థనలు మరియు మీ త్యాగపూరితమగు కానుకలు లేనిదే ఇటువంటి పరిచర్య సేవలు ఎన్నడూ సాధ్యమయ్యేవి కావు. పరలోకము మీ విశ్వాసమును రికార్డు చేసి మీకు బహిరంగముగా ఖ్యాతిని ఇస్తుంది (2 కొరింథీయులకు 9:6).

భాగస్థులగు మీకు కృతజ్ఞతలు!

గొప్ప లక్ష్యములు ముందున్నవి మరియు మీ క్రమానుగత సహకారము మమ్మును ముందడుగు వేసేలా చేస్తుంది. మనము సంయుక్తముగా గొప్ప పంటను కోసెదము. www.jesuscalls.org ని దర్శించండి.