నాకు అమూల్యమైన స్నేహితులారా, దేవుడు మీ కన్నుల ద్వారా మిమ్మును శక్తివంతులనుగా చేయాలని మీ పట్ల కోరుచున్నాడు. మీ కన్నులు ఎంతో శక్తిగలవై ఉన్నవి. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మత్తయి 13:16వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి'' అని చెప్పబడినట్లుగానే, మీ కన్నులు చూచుటకు ఆరంభించియున్నప్పుడు, అవి ధన్యవంతమైనవి. కేవలము మన శరీరములో మనము చూచుచున్న వాటిని, చూడడము మాత్రము కాదు, ఆత్మ సంబంధమైన వాటిని మనము చూచునప్పుడు, సకల ఆశీర్వాదములను మనము స్వీకరించెదము.

నా ప్రియులారా, మీ కన్నులు మీ దేహమంతటికిని దీపమై యున్నది. అందుకే బైబిల్ నుండి మత్తయి సువార్త 6:22,23వ వచనములలో చూచినట్లయితే, " దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగు మయమైయుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై యుండును; నీలోనున్న వెలుగు చీకటియై యుండిన యెడల ఆ చీకటి యెంతో గొప్పది'' అని చెప్పబడినట్లుగానే, కన్ను దేహమునకు దీపమై ఉన్నది. కానీ, మీ కన్నులు మంచిగా ఉన్నట్లయితే, మీ దేహమంతయు వెలుగుతో నింపబడియుంటుంది. మీ కన్నులు చెడువాటిని చూడడము లేక చెడువాటిని మీలోనికి తీసుకొనునట్లుగా చేయుచున్నప్పుడు, మీ యొక్క ఫోన్ ద్వారా కానీ, లేకపోయినట్లయితే, మీ భోగేచ్ఛలకు సంబంధించిన దృశ్యములను చూచుట ద్వారా లోకమంతయు అంధకారములో నింపబడి ఉంటుంది. నా ప్రియులారా, మీలో ఉన్న వెలుగు అంధకారమైతే, ఆ అంధకారము ఎంత ఘోరముగా ఉంటుంది కదా. అందుచేత యోబు 31:1వ వచనములో చూచినట్లయితే, "నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును? '' అని చెప్పబడినట్లుగానే, నా ప్రియులారా, కన్ను చాలా ప్రాముఖ్యమైనది. అది మన దేహమంతటికిని కూడా దీపమై యున్నది. కనుకనే, ఈ రోజు మీ కన్నులను యేసు కొరకు మరియు దేవుని యొక్క ఆత్మ కొరకు ప్రతిష్టించుకొని, ఈలాగున చెప్పండి, 'ప్రభువా, నేను చూడవలసిన దానిని మాత్రమే చూస్తూ, సందేశములను నా దేహము లోనికి స్వీకరించుటకు సహాయము చేయుము, అది ఎల్లప్పుడు నా దేహములోనికి వెలుగును తీసుకొని రావాలి, నేను చూచు దృశ్యము నా దేహములోనికి వెలుగును జీవమును తీసుకొని రావాలి. నా దేహము పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండాలి' అని అడగండి. మరియు మీ శరీరము భోగేచ్ఛలకు మరియు దురాశలకు ఆలయముగా ఉండకూడదు అని చెప్పి, మీ కన్నులను యేసునకు ప్రతిష్టించుకొనండి. మీ దేహమును పరిశుద్ధాత్మకు ప్రతిష్టించుకొనండి. ఆయన వెలుగును, సత్యమును జీవమును మీ శరీరంలోనికి తీసుకువచ్చు వాటిని మాత్రమే మీ కన్నులు స్వీకరించునట్లుగా చేయును. కనుకనే, మీ శరీరం అంధకారమునకు నివాస స్థలం కాకుండా, పరిశుద్ధాత్మకు ఆలయంగా మారుతుంది.

రెండవదిగా, మీ కన్నులు తెరువబడినప్పుడు, మీరు రక్షణను స్వీకరిస్తారు. దేవుని యొక్క రక్షణ యేసుక్రీస్తు యొక్క మీ జీవితములో సంపూర్ణము గావించబడుతుంది. అందుకే బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 26:18వ వచనమును చూచినట్లయితే, " వారు చీకటిలో నుండి వెలుగులోనికిని సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచ బడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. '' ఆ ప్రకారముగానే, వారు చీకటిలో నుండి వెలుగులోనికిని తీసుకొని రావడానికి మరియు సాతాను అధికారము అదుపులోనికి తీసుకొని వచ్చుటకును తద్వారా, వారు పాపక్షమాపణ స్వీకరించునట్లుగాను కన్నులు తెరవజేయుచున్నాడు. ఆలాగుననే, బైబిల్ నుండి లూకా 2:30వ వచనములో చూచినట్లయితే, "అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల యెదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని'' అని చెప్పబడినట్లుగానే, సుమెయోను ఒక పసిబిడ్డగా యేసును తన చేతులలోనికి తీసుకున్నాడు. తన కన్నులతో ఆయనను చూచియున్నాడు. అందుకే, పై వచనములో, 'ప్రభువా, నీ రక్షణ నా కన్నులు చూచియున్నవి' అని సుమెయోను అంటున్నాడు. అవును, నా ప్రియులారా, మీ కన్నులు దేవుని రక్షణను మాత్రమే చూడవలసియున్నది. అప్పుడు మీ జీవితములో ఏ విచలనము ఉండదు. ఎల్లవేళల, ఆయన చిత్తమును నెరవేర్చుటకు దేవునితో కలిసి పనిచేయుటకు శక్తిని కలిగియుంటారు. మీ దృష్టి దేవుని రక్షణపై నిలిచినప్పుడు, నాశనం మిమ్మును జయించలేదు; మీరు నిత్యము ఆయన చిత్తానుసారంగా నడుచుచున్నారు.

మూడవదిగా, దేవుడు మీ కన్నులను తెరవజేయుచున్నాడు. ఆయన మీకిచ్చు భద్రతను చూచునట్లుగాను, ఆయన మీ కన్నులను తెరవజేయుచున్నాడు. అందుకే బైబిల్ నుండి 2 రాజులు 6:17వ వచనములో చూచినట్లయితే, "యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేతను నిండియుండుట చూచెను'' ప్రకారము శత్రువు రాజు ఎలీషాను చెరపట్టుటకు తన సైన్యమును పంపించియున్నాడు. గొప్ప సైన్యము వచ్చినది, కానీ, ఎలీషా నెమ్మదిగా ఉన్నాడు. అయితే, అతని సేవకుడు మాత్రమే భయముతో వణికిపోతున్నాడు. అప్పుడు, 'ఏలీషా, ప్రభువా, పనివాని కన్నులు తెరవజేయుమని చెప్పాడు. ఆత్మలో అతని నేత్రములు తెరవజేయబడగానే, ఎలీషా చుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేతను నిండియుండుట చూచెను. కానీ, ఆ పనివాడు ఎలీషా చుట్టు ఉండుట చూచియున్నాడు. ఎలీషా దేవుని శక్తిచేత నింపబడియున్నాడు. సైనికుల యొక్క కన్నులకు గుడ్డితనము కలుగునట్లుగా ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన వారందరిని బయటకు నడిపించాడు. వారి కన్నులు తెరవజేయబడుట కొరకు ప్రార్థించాడు. ఆ శత్రువులు ఇక ఎన్నటికి తిరిగి రాలేకపోయారు. కానీ, రాజు వచ్చి, రాజు కుటుంబము వచ్చి, ఆయన పాదముల చెంత పడిపోయారు. అవును, నా స్నేహితులారా, మీ కన్నులు ఆయన భత్రను చూడవలసి యున్నది. ఏ నరుడు అధిగమించలేని సింహము వలె మీరు ఉండెదరు. మీరు దేవుని చిత్తమును నెరవేరుస్తారు. రాజులు మిమ్మును అధిగమించలేరు. దుష్ట సైన్యములు మిమ్మును జయించజాలవు. మీరు దేవుని చిత్తమును నెరవేర్చెదరు. రాజులు వచ్చి, ఎలీషా పాదముల చెంత పడిపోయి, ఈలాగున చెప్పారు, 'తండ్రీ, ఈ దేశమును ఎలా పరిపాలించవలెనని చెప్పండి, ' అని ఎలీషాను అడిగాడు. మీకును ఆలాగననే జరుగుతుంది.

చివరిగా, మీ కన్నులు తెరవజేయబడినప్పుడు, దేవుడు మీకు ఇచ్చిన పిలుపును మీరు ఎరిగియుంటారు. అపొస్తలుడైన పౌలుకు ఆలాగున జరిగింది. అందుకే బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 9:18వ వచనములో చూచినట్లయితే, " అప్పుడే అతని కన్నుల నుండి పొరలవంటివి రాలగా దృష్టికలిగి, లేచి బాప్తిస్మము పొందెను; తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను'' అని చెప్పబడినట్లుగానే, సౌలుగా ఉన్నవాడు, బలమైన అపొస్తలుడైన పౌలుగా రూపాంతపరచబడ్డాడు. ఆలాగుననే, నా ప్రియులారా, మీరు కూడా రూపాంతరపరచబడతారు. నా ప్రియులారా, దేవుడు మీ జీవితానికి సంబంధించిన తన పిలుపును, ఉద్దేశ్యాన్ని మరియు గమ్యాన్ని కూడా బయలుపరుస్తాడు. మీ ఆధ్యాత్మిక కన్నులు తెరవబడినప్పుడు, మీరు ఆయన ప్రణాళికలో నడుస్తూ, విశ్వాసంతో మరియు శక్తితో ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియ ప్రభువా, ఆత్మీయ దృష్టి అనే వరమును మాకు ఇచ్చినందుకు మీకు వందనములు. తండ్రీ, మాకు నీ అవగాహన నేత్రములను మరియు రక్షణ నేత్రములను మాకు అనుగ్రహించుము. దేవా, మా పిలుపును ఎరుగు కన్నులను మాకు దయచేయుము. ప్రభువా, మేము భద్రతను చూచు కన్నులను మాకు దయచేయుము. యేసయ్యా, నీవు వెలుగుగా ఉన్నట్లుగానే, మా దేహమునకు వెలుగుగా ఉండు కన్నులను మాకు దయచేయుము. ప్రభువా, మాలో ఉన్న ప్రతి అంధకారమును తొలగించబడునట్లుగా చేయుము. దేవా, నీ యొక్క వెలుగును, నీ రక్షణను, నీ సంరక్షణను, మరియు మా జీవితం కొరకు నీవు సిద్ధపరచిన పిలుపును చూచుటకు మా కన్నులను తెరువుము. ప్రభువా, చీకటిని కలిగించే ప్రతిదాని నుండి మా కన్నులను కాపాడండి మరియు మమ్మును ఘనపరిచే విషయాలపై దృష్టి పెట్టడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా శరీరం నీ వెలుగుతో నిండి, పరిశుద్ధాత్మకు ఆలయంగా నిలిచియుండునట్లుగా చేయుము. ప్రభువా, నీ సన్నిధిని మేము గుర్తించి, నీ సంరక్షణ మీద నమ్మకం ఉంచి, నీ సంకల్పంలో విశ్వాసంగా నడుచ్నుట్లుగా గ్రహించు శక్తి కన్నులను తెరువుము. ప్రభువా, మా జీవితం నుండి ప్రతి చీకటిని, భయమును మరియు గందరగోళాన్ని తొలగించుము. దేవా, నీ యొక్క శక్తి ద్వారా మమ్మును రూపాంతరపరచుము. ప్రభువా, నీ యొక్క పరిపూర్ణ చిత్తమును నెరవేర్చుటకు మాకు సహాయము చేయుమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.